బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే అని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఈ మేరకు గురువారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ మహిళ విద్యాభివృద్ధికి మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత, మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు.