భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలోని 4వ వార్డు కుమ్మరిపేట వాసుల దశాబ్దాల కోరిక బుధవారం నెరవేరంది. భీమడోలు-ద్వారకాతిరుమల రాష్ట్ర రహదారి నుండి కుమ్మరిపేట రామాలయం వరకు నిరూపయోగంగా ఉన్న పుంత దారిని గ్రావెల్ రోడ్డుగా నిర్మించేందుకు శంకుస్థాపన పనులను సర్పంచ్ షేక్ రహీమా హసీనా బేగం శ్రీకారం చుట్టారు. అనంతరం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకి కృతజ్ఞతలు తెలిపారు.