ఏలూరు: మహిళలు సహాయం కోసం ఫోన్ చేయండి

ఏలూరు జిల్లాలో ఎక్కడైనా కుటుంబ తగాదాలతో ఇంటినుంచి బయటకు వచ్చిన మహిళలు, బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి ఇంటికి పంపించాలని శుక్రవారం కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులకు ఆదేశించారు. ఎటువంటి ఆధారం లేని మహిళల, పిల్లలను పునరావాస గృహాలకు తరలించాలన్నారు. బాధిత మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మహిళల సహాయం కోసం టోల్ ఫ్రీ నెం. 112, నెం. 9550351100, 9491195221 లకు ఫోన్, వాట్సాప్ చేయాలన్నారు.