ఏలూరు కలెక్టర్ కార్యాలయం గోదావరి మీటింగ్ హాల్ లో "స్వచ్ఛత హి సేవ 2024" కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ పాల్గొన్నారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతిజ్ఞ చేశారు.