భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తంగెళ్లమూడి, కోమడవోలు ఆయకట్టు పరిధిలో ముంపునకు గురైన వరి పంట పొలాలను సంఘం నాయకులు ఆదివారం పరిశీలించారు. మురుగు డ్రైన్లలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, పూడికను పరిశీలించి, పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.