సర్‌ప్లస్ టీచర్ల వర్క్ అడ్జస్ట్‌మెంట్ కౌన్సెలింగ్ బుధవారంతో ముగిసిందని డీఈవో అబ్రహం తెలిపారు. తుది విడతగా ఏలూరు జిల్లాలోని 28 మండలాల్లో సర్‌ప్లస్ ఎస్జీటీలుగా వున్న 200 మందిని అదే మండల పరిధిలో కొరత వున్న పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 160 మంది ఎస్జీటీలు అదే కేడర్‌లోని వెకెన్సీలను కోరుకోగా, ఇంకా మిగిలిపోయిన 40 మందిని ప్రస్తుత స్థానాలకే వెనక్కి పంపివేశారు.