సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరు వసంత మహల్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గెద్దలకు పెట్టిన చందంగా కార్మికులు, రైతాంగంపై భారాలు వేసి కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టే బడ్జెట్ గా ఉందంటూ మండిపడ్డారు.