ఏలూరు మండలం గుడివాకలంక డీ4 సెక్షన్ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో లైన్ మరమ్మతులు, చెట్ల కొమ్మల నరికివేత పనులు చేపట్టనున్నట్లు ఈఈ నటరాజన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. తిమ్మారావుగూడెం, కేడీ పురం, గుడివాకలంక, మొండికోడు, ప్రత్తికోళ్లలంక, పైడిచింతపాడు, చినయాగిరిమిల్లి, కొక్కిరాయిలంక, కోమటిలంక గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.