ఏలూరు జిల్లాలో గురువారం పంపిణీ చేయాల్సిన స్పౌజ్ పెన్షన్ల పంపిణీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ రాజు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ సుపరిపాలన - స్వర్ణాంధ్ర కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు విజయవాడ వెళ్తున్నారన్నారు. దీంతో స్పౌజ్ పెన్షన్ల పంపిణీ వాయిదా పడిందన్నారు. త్వరలో ఈ పింఛన్ల పంపిణీ తేదీని ప్రకటిస్తామన్నారు.