ఏలూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 16, 077 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఓట్లలో 9, 858 మంది పురుషులు, 6, 218 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారన్నారు. 20 పోలింగ్ స్టేషన్ లకు అదనంగా, మరో పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 8, 501 క్లైమ్‌లు అందాయన్నారు.