ఏలూరు జిల్లా వ్యాప్తంగా జూలై 5న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 6, 325 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసు కూడా రాజీ కుదిరిందని స్పష్టం చేశారు. శనివారం 35 బెంచ్‌లలో ఈ కార్యక్రమం జరిగిందని, ఇది విజయవంతం కావడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను ఆమె ప్రశంసించారు.