ఏలూరు నగరంలో సోమవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 720 మంది అభ్యర్థులు హాజరయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. నగరంలోని సిద్దార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 180 మందికి 179 మంది, మధ్యాహ్నం 180 మందికి 159 మంది హాజరయ్యారన్నారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 196 మంది, మధ్యాహ్నం 200 మందికి 186 మంది హాజరయ్యారని తెలిపారు.