ప్రతిరోజూ యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, శరీర బరువు అదుపులో ఉంటుందని కలెక్టర్ వెట్రి సెల్వి పేర్కొన్నారు. జిల్లాలో 8,50,189 మంది పౌరులు యోగాంధ్ర యాప్‌లో నమోదు చేసుకున్నారని శనివారం తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జూన్ 18న కామవరపుకోట మండలం గుంటుపల్లిలో యోగా కార్యక్రమం జరగనుందని వెల్లడించారు.