ఏలూరు లోని తంగెళ్లమూడి భాగ్యనగర్ కాలనీలో మే 26న తాళం వేసిన ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, రూ.5 లక్షలు దొంగిలించిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పెదపాడు ఇందిరా కాలనికి చెందిన సత్తెనపల్లి రాకేశ్‌గా గుర్తించి సోమవారం హనుమాన్నగర్‌లో అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి దొంగిలించిన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.