ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యలపై సమర్థవంతంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. మంగళవారం మల్కాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన ఎమ్మెల్యే , కృష్ణా కాలువ నుండి మోటార్ల సహాయంతో నీరు పంపించే ప్రక్రియను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు అందించారు. ప్రస్తుతం 17 మోటార్ల ద్వారా ట్యాంక్‌ను నింపే కార్యక్రమం జరుగుతోందని అన్నారు.