ఏలూరు: లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా, చట్టప్రకారం చర్యలు తప్ప వని రెవిన్యూ డివిజనల్ అధికారి యం. అచ్యుత అంబరీష్ అన్నారు. ఏలూరు రెవిన్యూ డివిజినల్ అధికారి ఛాంబర్లో పిసిపియన్ డిటి యాక్టు 1994 (గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం )పై సంబంధిత అధికారులతో ఆర్డీవో యం. అచ్యుత అంబరీష్ మంగళవారం సమావేశం నిర్వహించారు. సమాజంలో స్త్రీ, పురుషులు ఇరువురు సమానమేనని దేనిలోనూ తక్కువ కాదన్నారు.