ఏలూరు: అంబేద్కర్‌ సేవా ట్రస్ట్‌ కరపత్రాల పంపిణీ

78చూసినవారు
ఏలూరు: అంబేద్కర్‌ సేవా ట్రస్ట్‌ కరపత్రాల పంపిణీ
అంబేద్కర్‌ సేవా ట్రస్ట్‌ కరపత్రాలను మండలంలోని చింతలవల్లి శివారు గోగులంపాడు గ్రామంలో ఆ ట్రస్ట్‌ ఛైర్మన్‌ ప్రత్తిపాటి వరకిషోర్‌ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, ఆరోగ్య సదుపాయాల కల్పన, వృద్ధులకు, వితంతువులకు, నిరుపేదలకు, అనాధలకు, వికలాంగులకు ఈ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు అందించనున్నట్లు తెలిపారు. బిఆర్‌.అంబేద్కర్‌ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వరకిషోర్‌ చేస్తున్న కృషి హర్షణీయమని గ్రామస్తులు అన్నారు.

సంబంధిత పోస్ట్