ఏలూరు: ఎమ్మెల్యేకు వినతుల వెల్లువ

50చూసినవారు
ఏలూరు: ఎమ్మెల్యేకు వినతుల వెల్లువ
ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వినతులందించేందుకు వచ్చినవారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. ప్రధానంగా పెన్షన్లు, ఇళ్ళ మంజూరుతో పాటూ సంబంధిత సమస్యలను పలువురు విన్నవించగా అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్