ఏలూరు మండలం చోడిదిబ్బ ప్రాంతానికి చెందిన వెంకట దుర్గా శంకర్ ను ఈనెల 2న చింటు, మరో ఇద్దరు మందు తాగడానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో బీరు సీసాతో శంకర్ పై దాడి చేశారు. తీవ్ర గాయాలతో శంకర్ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం ఏలూరు టూటౌన్ పోలీసులు చింటు, మరో ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.