ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చిక్కా భీమేశ్వరరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కార్మిక సంఘాల నాయకులు, పలువురు నగర ప్రముఖులు, మేధావి వర్గాలు చెందిన వారితో కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే, శారద దంపతుల విగ్రహాలకు చిక్కా భీమేశ్వరరావు దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.