కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 11న జరుగుతున్న చలో మంగళగిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. సోమవారం ఏలూరులో కౌలు రైతుల చలో మంగళగిరి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలు పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.