ఏలూరు: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత

210చూసినవారు
ఏలూరు: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత
ఏలూరు: సీఎం సహాయ నిధి పేదలకు మేలు చేస్తుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. శనివారం మండలంలో బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీయం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. బడుగు బలహీన వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం ఆపన్న హస్తంగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదప్రజల సహాయార్థం, సహృదయంతో బాధితుల కోసం సహాయ నిధులు విడుదల చేయటం ఆనంద దాయకమన్నారు.

సంబంధిత పోస్ట్