ఏలూరు: కామవరపుకోట టీడీపీ నాయకులు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. శుక్రవారం టీడీపీ అధ్యక్షులు ఏలూరి హరిరామకృష్ణ ఆధ్వర్యంలో కామవరపుకోటకు చెందిన నల్లమోతుల సత్యవతి, చేడే రామారావు, అడపా రాఘసుధ, తూర్పు ఎడవల్లికి చెందిన లక్ష్మీ, అచ్చమ్మకు చెక్కులు అందజేశారు. హరి మాట్లాడుతూ అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసిన ఎమ్మెల్యే రోషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.