ఏలూరు: కామవరపుకోటలో ముగ్గురు లబ్ధిదారులకు 1. 30 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను టీడీపీ అధ్యక్షులు ఏలూరి హరిరామకృష్ణ ఆధ్వర్యంలో అందజేశారు. శనివారం ఆడమిల్లికి చెందిన రాంబాబు, లక్ష్మీనారా యణ, కళ్ళచెరువుకి చెందిన స్వామికు మొత్తం రు. 1. 30 లక్షల చెక్కులను హరిబాబు చేతుల మీదగా అందజేశారు. అడిగిన వెంటనే సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు సాయం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.