ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీయే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఏలూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తిరుగులేని విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.