పెన్షన్‌దారుల్లో ఆనందం నింపేందుకు కూటమి ప్రభుత్వం విశేష కృషిచేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బుధవారం తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజలు పోటెత్తారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు.