కోకో పంటకు సరైన గిట్టుబాటు ధర రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఏలూరు జిల్లాకు చెందిన రైతులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చొరవతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో జీరో పావర్టీ -పీ4 ప్రారంభోత్సవలో శుక్రవారం విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిశారు.