ఏలూరు పడమరవీధి గంగానమ్మ మునిసిపల్ హై స్కూల్లోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు బోధిస్తున్న ప్రీ స్కూల్ ఆక్టివిటీస్ ను కలెక్టర్ పరిశీలించారు. పిల్లలతో ఇంగ్లీష్ లో పలు ప్రశ్నలు వేశారు. వాటికి ఆ చిన్న పిల్లలు చెప్పిన సమాధానాలకు కలెక్టర్ ముగ్దులయ్యారు.