దరఖాస్తుదారుడు సంతృప్తి చెందేలా పిజిఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ప్రజా సమస్యల పరిష్కార విధానంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఐవిఆర్ఎస్ సర్వే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ధరఖాస్తుదారుడి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సమస్యను సావధానంగా వినాలని సూచించారు.