ఏలూరు: వసతి గృహాల స్థితిగతులపై కమిటీ నియామకం

69చూసినవారు
ఏలూరు: వసతి గృహాల స్థితిగతులపై కమిటీ నియామకం
జిల్లాలో శిథిలావస్థలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల భవనాల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించడానికి కమిటీని నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో సమీక్షించారు. ఇందులో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ మరమ్మతులు, అభివృద్ధి పనులపై సంక్షేమ అధికారులు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీర్లతో పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు.

సంబంధిత పోస్ట్