ఏలూరు: శరవేగంగా 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణ పనులు

85చూసినవారు
ఏలూరు: శరవేగంగా 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణ పనులు
కృష్ణ - ఏలూరు కాల్వపై నిర్మిస్తోన్న నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రజల చిరకాల కోరికను నెరవేర్చే దిశగా, ఈ ప్రాజెక్టును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. రూ. 5 కోట్ల నిధులతో ఇటీవల శంకుస్థాపన జరగగా, ప్రస్తుతం ఫౌండేషన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. శనివారం ఎమ్మెల్యే అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమై పనుల పురోగతిని సమీక్షించారు.

సంబంధిత పోస్ట్