ఏలూరు నగరంలోని స్థానిక శనివారపుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ప. గో. జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.