ఏలూరు: జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి

65చూసినవారు
ఏలూరు: జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి
ఏలూరు: జూలై 5వ తేదీ నుంచి 7 వరకు చింతలపూడిలో జరిగే జిల్లా మహాసభకు కుక్కునూరు మండలం నుంచి భారీ సంఖ్యలో కామ్రేడ్స్ తరలివచ్చి విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా సీపీఐ కార్యదర్శి మన్నవ. కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. శనివారం సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల కోసం అలుపెరగని, రాజీలేని పోరాటాలు చేసిన చరిత్ర గల ఏకైక పార్టీ సీపీఐ పార్టీ అని అన్నారు.

సంబంధిత పోస్ట్