ఏలూరు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం పలు డివిజన్లకు చెందిన ప్రజలు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని వారి సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.