2027 అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలు జరగొచ్చని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఈవీఎంల వల్లే కూటమి ప్రభుత్వం గెలిచిందని ఆదివారం ఆరోపించారు. పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో భూసేకరణపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ఎమ్మెల్యేలు దోచుకునేందుకు పోటీ పడుతున్నారని మండిపడ్డారు.