ఏలూరు: 'ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయాలి'

61చూసినవారు
ఏలూరు: 'ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయాలి'
పుట్టిన ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేసి, ఏ బిడ్డా పోలియో బారిన పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం పిల్లలకు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పోలియో చుక్కలను వేశారు.

సంబంధిత పోస్ట్