ఏలూరు: ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలి

56చూసినవారు
ఏలూరు: ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలి
ఏలూరులోని స్థానిక 27 వ డివిజన్ చొదిమెళ్ళలో అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ అప్పలనాయుడు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్