ఏలూరు: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

58చూసినవారు
ఏలూరు: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
ఆపన్నులకు చేయూతను అందించటం రోటరీ క్లబ్ లక్ష్యమని అందుకు సంస్థ సభ్యులు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన జంగారెడ్డిగూడెం లోని మొడియం కాలనీ వాసి నాగేంద్ర అనే ఆటో డ్రైవర్ కుటుంబానికి రోటరీ తరఫున శుక్రవారం రూ.10వేలు ఆర్థిక సహాయం అందించారు. నిరాశ్రయులైన నాగేంద్రను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్