'ఏలూరు సాక్షి ఆఫీసుకు నిప్పు అంటుకుంది' అనే వార్త నిన్న ఏపీలో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. సాక్షి కార్యాలయం ఉన్న భవనంలోనే కింద పాత ఫర్నీచర్ గోదాం ఉంది. దీంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో సమీపంలో నిరసనలు జరుగుతుండటంతో ఇది దాడి అనుమానాలు తలెత్తాయి. కానీ అంతలోనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇది ఫర్నీచర్ షాపులో జరిగింది అగ్నిప్రమాదమేనని స్పష్టం చేశారు.