ఏలూరు: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

65చూసినవారు
ఏలూరు: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏలూరు డి. యల్. టి. సి సహాయ సంచాలకులు ఎస్. ఉగాది రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. షార్ట్ టర్మ్ కోర్స్ క్రింద “ఫీల్డ్ టెక్నీషియన్-ఎయిర్ కండిషనర్”కోర్సులో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఆ పైన ఉత్తీర్ణులైన వారు 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. ఈనెల 20 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్