ఏలూరు తూర్పు వీధిలో నివసించే 67ఏళ్ల జాబిల్లి ఆదివారం ఉదయం వ్యక్తిగత పనులతో ఇంటికి తాళం వేసి వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి రాగానే ఇంటిలోని 60 కాసుల బంగారు ఆభరణాలు మాయం అయినట్టు గుర్తించారు. ఆమె బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. వెంటనే ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.