ఏలూరు సత్రంపాడులో యూనియన్ గ్రామీణ ఉపాధి సంస్థ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఈ సంస్థ ద్వారా ఫొటోగ్రఫీ, బ్యూటీ పార్లర్, జ్యూట్ బ్యాగ్ తయారీ, సీసీటీవీ, ఏసీ రిపేర్, టైలరింగ్, కంప్యూటర్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ ఫణి కిశోర్ తెలిపారు. 18-45 ఏళ్ల వయస్సు గల వారు, 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినవారు అర్హులని చెప్పారు. నిరుద్యోగులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.