ఏలూరు నగర సమీపంలోని వంగూరు సివిల్ సప్లైస్ బఫర్ గోదాము, ఏలూరు మండల స్ధాయి గోదాములను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. గోదాము ఇన్‌ఛార్జ్ తో కలిసి రికార్డులను పరిశీలించారు. పేదలకు సంబంధించిన సరుకులను సకాలంలో పంపిణీ చేసేలా చూడాలని , ఏమైనా అవకతవకలకు పాల్పడినా, అక్రమాలు చేసిన సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.