కృష్ణ డెల్టా పరిధిలో ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పూర్తయ్యాయనే పేరుతో రైతులు, కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏమిటని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ప్రశ్నించారు. శుక్రవారం ఏలూరు నగరంలోని స్థానిక అన్నే భవనంలో ధాన్యం కొనుగోలు సమస్యలపై అయన మాట్లాడారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.