ఏలూరు: వైభవంగా ఆషాడ మాసం సారీ సమర్పణ
By పల్లె పాము అర్జునరావు 1చూసినవారుఏలూరు: కామవరపుకోట లో అమ్మవార్లకు గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా ఆషాడ మాస సారె సమర్పణ కార్యక్రమం జరిగింది. ఆదివారం శ్రీ గంగానమ్మ తల్లి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లతో పాటు కొత్తూరు చెక్‌పోస్టు సెంటర్లో ఉన్న కనకదుర్గమ్మ తల్లి అమ్మవార్లకు రంగరంగ వైభవంగా సారెను సమర్పించారు. గ్రామస్తులు అందరూ గ్రామ పురవీథులలో మేళతాళాలు, వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు.