ఏలూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆదివారం కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ నేతలు పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అంటే ఒక నమ్మకమని, ఉన్నది ఉన్నట్టుగా పాలన సాగించిన వైసీపీ అధినేత జగన్ అంటే ప్రజల్లో నమ్మకానికి మారుపేరని అన్నారు. కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు మోసానికి ప్రతిరూపమని నోటికి వచ్చిన వాగ్దానాలన్నీ చేసి అధికారంలోకి వచ్చి, వాగ్దానాలను, హామీలను మర్చిపోయారన్నారు.