ఏలూరు: చేపల చెరువులో పడవ బోల్తా కూలీ మృతి

72చూసినవారు
ఏలూరు: చేపల చెరువులో పడవ బోల్తా కూలీ మృతి
చేపల చెరువులో పడవ బోల్తా పడటంతో కూలీ మృతి చెందిన ఏలూరు రూరల్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన జగదీశ్ (43) తన కుటుంబంతో కలిసి పోణంగిలోని ఓ చేపల చెరువులో కాపలా పని చేస్తున్నారు. చెరువులో బుధవారం చేపలకు మేత వేస్తుండగా. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. ప్రమాదంలో జగదీశ్ నీట మునిగి మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్