ఏలూరు జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ, భూసేకరణ అంశాలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఖమ్మం నుంచి దేవరపల్లి 365 బిజి (గ్రీన్ ఫీల్డ్ హైవే) కు రైతులకు ఇవ్వాల్సిన నగదు చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు.