ఏలూరు రూరల్ మండలం జాలిపూడికి చెందిన రాజేశ్, గౌరీశ్వరి దంపతుల మధ్య కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం ఉపాధి హామీ పనికి వెళ్లొచ్చిన గౌరీశ్వరి ఇంట్లోనే ఉరేసుకున్నారు. కాసేపటికి భర్త గమనించి, స్థానికుల సాయంతో సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.