వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం తాడేపల్లి వారి కార్యాలయంలో వైసిపి ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్ర వీరన్న మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ చేస్తున్న అరాచకాలపై ధైర్యంగా ఉండాలని కార్యకర్తలు అందరికీ పార్టీ అండగా ఉంటుందని మాజీ సీఎం జగన్ అన్నారు.